26 July, 2026 | 4:29 AM

మహిళ మెడలో తాళి లాక్కునే యత్నం

26-07-2026 12:00 AM

నిందితుడిని పట్టుకున్న స్థానికులు

ఉప్పల్, జూలై 25విజయక్రాంతి : ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ మహిళ మెడ లో ఉన్న బంగారు గొలుసు (మంగళసూత్రం)ను లాక్కొనేందుకు ప్రయత్నించిన వ్య క్తిని బాధితురాలి కుమారుడు, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా.. బాధితురాలు తన కుమారుడు ధీరజ్‌తో కలిసి కోదాడకు వెళ్లేందుకు శనివారం ఉదయం 5:40 గంటలకు ఉప్పల్ ఎక్స్‌రోడ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఎల్‌బి నగర్ వైపు చేరుకున్న సమయంలో, ఆమె కుమారుడు ముందుగా నడుస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయగా, ధీరజ్‌తో పాటు అక్కడ ఉన్న వారు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.