15 April, 2026 | 7:49 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

15-04-2026 01:15 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి..

మెదక్, ఏప్రిల్ 14(విజయ క్రాంతి) : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని పేర్కొన్నారు.  కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, సంధ్య నవీన్, ఉదయ్ కుమార్, గౌస్, సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం చంద్రకళ, రాధ, నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం, లింగా రెడ్డి, ప్రభు రెడ్డి, కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్, రవి లక్ష్మీనారాయణ, దశరథం, ఇందాడ్, సంతోష్, వెంకట్, ఆంజనేయులు, ప్రభాకర్, లక్ష్మణ్, కిషన్, మోహన్, ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. 

విద్యుత్ ఆర్టిజెన్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో గత 7 రోజులుగా కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో పాల్గొని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, విద్యుత్ కార్మికుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు.

ఇప్పటికే వారం రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు,మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, జుబెర్ అహ్మద్, ఉదయ్ కుమార్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, నాయకులు పూసల సంతోష్ సునీల్, ఇందాద్ మోహన్, మహిళా నాయకురాలు చంద్రకళ, రాధ , విద్యుత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.