9 May, 2026 | 10:24 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

గోవిందాపూర్‌లో ఇంటింటికీ నల్లా కనెక్షన్

09-03-2026 12:55 AM

ఘనంగా జల మహోత్సవం 

మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్ ఉన్న గ్రామంగా ప్రకటించి ఆదివారం జల మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నీటిని వృధా చేయకుండా, నీటి ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

భూగర్భ జలాల సంరక్షణ, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు, చెరువులు కుంటలు శుభ్రంగా ఉంచుకోవడం, వర్షపు నీటిని సంరక్షించుకోవడంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ ఈఈ సురేందర్, ఎంపీడీవో మీర్జా మున్వర్ బేగ్, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, వాటర్ మెన్లను ఘనంగా సత్కరించారు.