భీమా కుటుంబానికి రూ. లక్ష అందజేత
09-03-2026 12:56 AM
కేసముద్రం, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కస్న తండా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోతు భీమా నాయక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆదివారం శాసనమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి బీమా కుటుంబ సభ్యులను పరామర్శించి పి ఆర్ టి యు టి ఎస్ సంఘం తరఫున లక్ష రూపాయల నగదు చెక్కును ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
బీమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత టీచర్ బీమా కుటుంబానికి రావలసిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గౌడ్, అర్జున్, నర్సింగ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.




