1 March, 2026 | 4:52 AM

యూరియా యాప్ మాకొద్దు

01-03-2026 12:53 AM
  1. పాత పద్ధతిలోనే పంపిణీ చేయండి 
  2. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రైతుల ఆందోళన 
  3. జిల్లాలో 15 రోజులుగా ఆందోళనలు

నిజామాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఇందల్వాయి పీఏసీఎస్‌లో 400 బస్తాల యూరియా వచ్చిందన్న సమాచారం అందుకున్న రైతులు భారీగా చేరుకున్నారు. యాప్ ద్వారా నమోదు చేయించుకున్న రైతులకు యూరియా ఇస్తామని అధికారులు రైతులకు తెలిపారు. యూరియా యాప్‌లో నమోదుకై రైతులు ప్రయత్నించగా నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది.

దీంతో ఆగ్రహించిన రైతులు పీఏసీ ఎస్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. యూరియా యాప్‌ను తొలగించాలని కోరారు. యూరి యా కొరత తీర్చకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాప్‌ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యాప్ లో స్టాక్ వచ్చినట్టు సమాచారం వచ్చిన మరుక్షణమే నో స్టాక్ బోర్డు దర్శనమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో యూరియా యాప్ వద్దంటూ రైతులు 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. యూరియా యాప్ వద్దని, పాత పద్ధతిని పాటించాలని కోరుతూ జిల్లాలోని ఎక్కరాజుపల్లి, నవీపేటలో ఆందో ళనలు చేస్తున్నారు. శనివారం ఇందల్వాయిలో ఆందోళన చేశారు.