26 May, 2026 | 6:49 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు

14-10-2025 12:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిబిపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ లతో మాట్లాడారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ పరేడ్ను స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నైపుణ్యంతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వివరించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

బ్లూ కోర్ట్ పెట్రో కార్ సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానితుల ప్రతి కదలికపై నిగా పెట్టాలని సూచించారు.  ఎస్పీ రాజేష్ చంద్రన్న తో పాటు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.