31 August, 2026 | 3:19 AM

కాలేజీలను విలీనం చేయొద్దు

31-08-2026 01:00 AM
  1. పాలిటెక్నిక్ కాలేజీలపై జీవో97ను రద్దు చేయాలి
  2. విలీనంతో విద్యార్థులపై ప్రతికూల ప్రభావం
  3. సీఎంకు లేఖ రాసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): పాలిటెక్నిక్ కాలేజీలను మూసివేయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం చేసే నిర్ణయా న్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆదివారం మీడియా కు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.97ను రద్దు చేయాలని విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు,

రాస్తారోకోలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ లను మహీంద్రా స్కిల్ యూనివర్సిటీలో వి లీనం చేయడం వల్ల విద్యార్థుల ఉన్నత విద్య, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల డిప్లొమా ద్వారా సాం కేతిక విద్యతో పాటు ఉద్యోగాలు, ఈసెట్ ద్వారా బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ వంటి అవకాశాలు పాలిటెక్నిక్ విద్యతో ఉన్నాయని తెలి పారు.

పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ లేదా స్వ ల్పకాలిక స్కిల్ ట్రైనింగ్‌తో సమానంగా చూ డవద్దన్నారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలతో అనుసంధానం చేయాలని, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్ షిప్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచాలని కోరారు. అలాగే శక్తి పాలసీని రద్దు చేసి, పాలిటెక్నిక్ కాలేజీలకు తగిన నిధులు కేటాయించాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.