15 August, 2026 | 3:30 PM

రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలకు దాతల చేయూత

15-08-2026 02:33 PM

ధర్మపురి,ఆగస్టు15(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు కంప్యూటర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా శనివారం పాఠశాలకు బహూకరించారు. అదేవిధంగా సాయిశ్రీనివాస లక్ష్మీ స్టోన్ క్రషర్ యజమాని గరినేని చక్రవర్తి  పాఠశాలకు ప్రింటర్‌ను, విద్యార్థులకు టీ-షర్టులను అందజేశారు. ఈ సామగ్రిని గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం, మాజీ జడ్పీటీసీ దోరిశెట్టి వెంకటయ్య చేతుల మీదుగా పాఠశాలకు బహురించారు. దాతలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, పంచాయతీ కార్యదర్శి స్రవంతి,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు దోరిశెట్టి తిరుమల,విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.