19 April, 2026 | 4:21 AM

ఇంటింటి విరాళం..ఊరూర ఆలయాలు

19-04-2026 12:44 AM
  1. నాగోబా ఆలయ నిర్మాణమే స్ఫూర్తి

గిరిజన గ్రామాల్లో పెర్సపెన్.. హనుమాన్ ఆలయాల నిర్మాణం

ఉట్నూర్, విజయక్రాంతి:ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి గోండు గిరిజనులు తమ గ్రామాల్లో హనుమాన్ ఆలయాలతో పాటు ఆదివాసి గిరిజన తెగల పెర్సాపెన్ ఆలయాల నిర్మాణం కోసం ఇంటింటికీ విరాళాలు సేకరిం చి నిర్మించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గిరిజన గూడెంలో ప్రతి శనివారం ఇంటింటికీ  తిరుగుతూ.. ఇంటివా రు ఇచ్చిన విరాళాలను ప్రతినెలా గ్రామ పటే ల్ ఆధ్వర్యంలో సమావేశమై లెక్కిస్తున్నారు.

ఈ విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామా ల్లో సుందరంగా హనుమాన్ ఆలయాలను రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు వెచ్చిం చి, నిర్మిస్తున్నారు. గ్రామాల్లో నిర్మించే ఆలయాలకు బయటవారితో పాటు ప్రజాప్రతిని ధులు, దైవభక్తి భావం ఉన్నవారు తమవంతు అందజేసే విరాళాలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గూడెంలోని ప్రతి ఇంటి నుంచి ప్రతి శనివారం వారికి తోచిన విధంగా అందించే విరాళాలతోనే గ్రామంలో ఆలయం నిర్మిస్తామని గ్రామాల పటేళ్లు, దేవారిలు విరాళాలు ఇచ్చే వారికి చెప్పేస్తున్నారు.

గూడెంలో అవసరానికి ఆర్థిక సాయం

ప్రతివారం ఇంటింటి నుంచి సేకరించిన విరాళాలను ప్రతినెలా గ్రామ పెద్దల సమక్షం లో డబ్బులు లెక్కిస్తారు. గూడెంలోని ప్రతి ఇంటి నుంచి సేకరించిన విరాళాలను గ్రామంలో అవసరమైన వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు సేకరించిన విరాళాలు డబ్బులను వడ్డీతో అవసరమున్న వారికి అందిస్తున్నారు. తక్కువ వడ్డీతో గూడెంలో ఇచ్చే డబ్బులను తీసుకున్నవారు ఏడాదికి గ్రామ పెద్దల సమక్షంలో వడ్డీతో చెల్లిస్తారని టేకిడి కూడా గ్రామ పటేల్ శ్రీరామ్ సీతా రాం, గ్రామస్తుడు పేందూర్ బారికరావు తెలిపారు. తమ గూడెంలో 35 కుటుంబాల్లో ఇప్పటివరకు 25 లక్షల పొదుపు చేశామని గ్రామస్తులు తెలిపారు.

రూ.25 లక్షలతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించా మని గ్రామస్తులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ గ్రామీణం, జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, కేరామెరి, వాంకి డి, తీర్యాని తదితర మండలాల పరిధిలోని ఆదివాసి గోండు గిరిజనులు ఆలయాల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామంలో పొదుపైన డబ్బులతో ఆలయాలు నిర్మిస్తున్నారు.

నాగోబా ఆలయ స్ఫూర్తి.. 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని గ్రామ శివారులో కొలువుదీరిన ఆదివాసుల ఆరాధ్యదేవుడు  నాగోబాకు మెస్రం వంశీయులు ప్రభుత్వంతోపాటు ఇతర భక్తుల నుంచి ఆలయ నిర్మాణానికి విరాళాలు ఆశించకుండా రూ.ఐదు కోట్లతో ఆలయాన్ని నిర్మించారు.

మెస్రం వంశీయులు నిర్మించిన ఆలయాన్ని ఇతర ఆదివాసి గిరిజన వంశీయులు వారిని ఆదర్శంగా తీసుకొని వారి కు ల దేవతల (పెర్సపెన్) దేవత ఆలయాలతో పాటు గ్రామాల్లో హనుమాన్ మందిరాలను నిర్మించుకుంటున్నారు. ఆదివాసీ గిరిజన గోండు తెగలు ౪ దేవుళ్లు, 5 దేవుళ్లు, 6 ఆరు దేవుళ్లు, 7 దేవుళ్లు ఈ తెగలవారు వారివారి కుల దేవత ఆలయాలను నిర్మించుకొంటున్నారు.