అమ్మవారి మకర తోరణానికి 21 లక్షలు విరాళం
20-03-2026 12:00 AM
నిర్మల్, మార్చి 19 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయానికి పదవి కవిత వేణు చంద్ర గౌడ్ దంపతులు 21 లక్షల విరాళాన్ని గురువారం అందించారు. అమ్మవారి ఆలయం ప్రారంభించిన నేపథ్యంలో మకర తోరణం ఏర్పాటుకు దంపతులు స్వచ్ఛందంగా 21 లక్షలు ప్రకటించి అధికారులకు వీరరాళ పత్రాన్ని అందజేశారు. దాతలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వ్యాపారవేత్త మురళీధర్ గౌడ్, నాయకులు సురేందర్‌రెడ్డి ఆల కమిటీ చైర్మ న్ బోజగౌడ్ మాజీ జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు




