2 May, 2026 | 11:15 AM

ఇరాన్‌తో యుద్ధం ముగిసింది: ట్రంప్ కీలక ప్రకటన

02-05-2026 10:13 AM

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భిన్న ప్రకటనలు చేశారు. ఇరాన్ తో వైషమ్యాలు ముగిశాయని అమెరికా కాంగ్రెస్ కు ట్రంప్ తెలిపారు. యుద్ధం కొనసాగింపుపై ట్రంప్ తన అధికారాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం పొందాలనటం చట్ట విరుద్దమని ట్రంప్ పేర్కొన్నారు. 60 రోజుల అనుమతి వాదనపై ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులే కాదని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తో పోరాటాలు ముగిశాయని ట్రంప్ కాంగ్రెస్ కు లేఖ రాశారు.

యుద్ధాన్ని కొనసాగించాలంటే 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నందున గడువు వర్తించదని ట్రంప్ వాదిస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన వైషమ్యాలు ఇప్పుడు ముగిశాయని ట్రంప్ తెలిపారు. ఏప్రిల్  లో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి అమెరికా దళాలు దాడులు(US Forces Attacks) చేయలేదని సూచించారు. ఇరాన్ తో ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ప్రమాదం పొంచి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తో యుద్ధం కొనసాగింపుపై వైఖరి చెప్పడానికి ట్రంప్ నిరాకరించారు. ఇరాన్  నాయకత్వం అస్తవ్యస్తంగా ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఆయుధాల నిల్వలు తమ వద్ద గతంలో లేనంతగా ఉన్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తమకు భారీస్థాయిలో ఆయుధ సంపత్తి ఉందన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ప్రస్తుతం రెట్టింపు ఆయుధ నిల్వలున్నాయన్నారు. అవసరమైతే తమ ఆయుధ సంపత్తి ఎప్పుడైనా ఉపయోగించగలమని వెల్లడించారు. దాడులు ఆపినంత మాత్రాన.. యుద్ధం ముగిసినట్లు కాదని డెమొక్రాట్ల సెనేటర్లు పేర్కొన్నారు. అమెరికా యుద్ధనౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాయని సెనేటర్లు వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం.. చట్టాన్ని ఉల్లంఘిస్తోందని డెమొక్రాట్ల సెనేటర్లు ఆరోపించారు. అమెరికా కాంగ్రెస్(United States Congress)కు జవాబుదారీతనం ఉండాలని రిపబ్లికన్ సెనేటర్లు తెలిపారు.