28 August, 2026 | 10:27 AM

పీజీ ఎంట్రెన్స్‌ లో రాష్ట్రస్థాయి ర్యాంకర్లకు సన్మానం

27-08-2026 02:44 PM

ముకరంపుర, ఆగస్టు 27(విజయ క్రాంతి)పీజీ ఎంట్రెన్స్‌ పరీక్షల్లో ఫుడ్ సైన్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 39వ ర్యాంక్, తెలుగు విభాగంలో 48వ ర్యాంక్ సాధించి వాగేశ్వరి డిగ్రీ కళాశాలకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థినులు వోడ్నాల స్వాతి, చౌదరి సోనీలను  సన్మానించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గాదర్ల సతీష్ గౌడ్ మాట్లాడుతూ, స్వాతి, సోనీలు సాధించిన విజయం కేవలం వారి వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, వారి కృషి, పట్టుదలతో పాటు అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ప్రతీక అని అన్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.