23 March, 2026 | 3:04 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

వైద్య సేవలకు వస్తే... పిచ్చి కుక్కలు దాడి

23-03-2026 10:55 AM

పాలమూరు ప్రభుత్వం జనరల్ ఆస్పత్రిలో దారుణం 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేద మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు వైద్య సేవల కోసం వస్తే అర్ధరాత్రి పిచ్చి కుక్కలు దాడి చేసిన ఒక వైద్యానికి వస్తే మరో వైద్యం చేసుకోవాల్సిన దుస్థితి పాలమూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(Palamuru Government General Hospital)లో చోటుచేసుకుంది. ఆస్పత్రి లో పలువురు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చిన రోగులను జిల్లా జనరల్ హాస్పిటల్ కు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మెరుగైన వైద్య సేవలు అందుతాయని వచ్చిన రోగులకు పిచ్చికుక్క దాడిలో మరో రోగానికి గురైన సంఘటన చోటుచేసుకుంది.  వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు, వారి సహాయకులకు పిచ్చికుక్క అకస్మాత్తుగా వారి పైకి మొరుగుతూ దారుణంగా దాడి చేసింది.

ఆరుబయట నిద్రిస్తున్న రోగుల సహాయకులు నిద్రిస్తున్న చోటనే ఒక్కసారిగా దాడి చేసి కాళ్లు చేతులకు కరిచాయి. ఒకేసారి ఆరు మందిని కుక్కలు కాటు తో తీవ్ర గాయాలు అయ్యాయి.  108 అంబులెన్స్ లో అర్ధరాత్రి వైద్య సేవల కోసం తన కుటుంబంతో సహా వచ్చిన వారి చిన్నారి పాపను కరవడానికి కుక్క రావడంతో గమనించిన పాప తండ్రి  పైకి దాడి చేసేందుకు వెళ్ళగా అతని కూడా తీవ్రంగా కరిచింది. గత కొన్ని రోజుల నుంచి పిచ్చికుక్కలు జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కుక్క కాటు దాడులు చేస్తున్న నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చెబుతున్న మాట.  ఇంత జరిగిన కుక్క కాటు వేసి అర్ధరాత్రి జరిగితే ఇప్పటివరకు ఆ రక్తపు మడుగులను శుభ్రపరచని పరిస్థితి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉందని పలువురు వైద్య సేవలకు వచ్చిన బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో కుక్కలకు చోటు ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.