28 April, 2026 | 4:27 AM

పౌరుషం లేదా?

28-04-2026 01:38 AM

16 మంది ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా?

తెలంగాణ ఆవిర్భావాన్ని ఎంపీ సూర్య దేశ విభజనతో పోలిస్తే మౌనమేల?

  1. లోక్‌సభలో ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీ ఉన్నా రణరంగమే 
  2. సూర్యతో క్షమాపణలు చెప్పించే వాళ్లం
  3. కాంగ్రెస్‌ది కబ్జాల పాలన.. ధాన్యం కొనే దిక్కేలేదు.. 
  4. బీఆర్‌ఎస్ శ్రేణులు రైతుల పక్షాన పోరాడాలి..
  5. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 
  6. పార్టీ కార్యవర్గ సమావేశంలో క్యాడర్‌కు దిశానిర్దేశం 
  7. రాష్ట్ర కమిటీ తప్ప.. పార్టీ అన్ని కమిటీలూ రద్దు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావాన్ని, దేశ విభజనతో పోలుస్తూ లోక్‌సభ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడితే, ఒక్క బీజేపీ ఎంపీ అయినా నోరు మెదపకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే సభ రణరంగ మయ్యేదని అభిప్రాయపడ్డారు. ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీ లోక్‌సభలో ఉన్నా సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లమని స్పష్టం చేశారు.

సూర్య వ్యాఖ్యలు చేసినప్పుడు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది ఎంపీలు సభలోనే మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఆ 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? వాళ్లకు తెలంగాణ పౌరుషం లేదా? అంటూ నిలదీశారు. కేసీఆర్ ముందుగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నాయకులకు పరిచయం చేశా రు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు.

పార్టీ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపై ఒకసారి రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అవాకులు పేలబోతే బీఆర్‌ఎస్ పక్షనేత సురేశ్‌రెడ్డి తక్షణం స్పందించి, సదరు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించారని గుర్తుచేశారు. తనను ఎన్నోసార్లు, ఎంతోమంది మానసిక క్షోభకు గురిచేశారని భా వోద్వేగానికి గురయ్యారు.

హైదరాబాద్ విషయంలో రాజీపడాలని ఏఐసీసీ అగ్రనాయ కురాలు సోనియాగాంధీ నాడు ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చారని, అయినప్పటికీ తాను రాజీపడలేదని, తన చిత్తశుద్ధి ఎంతటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో పదవులకు రాజీనా మా చేయాలంటే, ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణం..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అక్రమాలు, భూకబ్జాలకు పా ల్పడుతున్నారని ఆరోపించారు. వారి అరాచకాలతో ప్రజలు విసుగు చెందారని, అం దుకే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని వాపోయారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చిల్లర ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని పెంటకుప్పగా మార్చారని మండిపడ్డారు. రైతులు పండిన పంటలన్నీ కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంట కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపుని చ్చారు. రైతులకు పూర్తి అండగా నిలవాలని చెప్పారు. సర్’ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతామని హెచ్చరించారు. 

పార్టీ నేతలకు దిశానిర్దేశం..

‘బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల కోసం ఎ న్నో సంక్షేమ పథకాలు అమలు చేసినం. సింగరేణి కార్మికులను అన్ని విధాలా అరుసుకున్నం. పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉ న్నాయి. అయినప్పటికీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినం. మనకు రాశి కాదు వాసి ముఖ్యం. ఓటమిపై ఒక్కసారి మనమం తా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంద రు నాయకులు ఇంకా అహంకారంతో ఉన్నారని తమకు సమాచారం అందిందని, ఇప్పటికైనా వారు తమ పద్ధతి మార్చకుని అందరినీ కలుపుకుని పోవాలని హితవు పలికారు.

అలాగే, బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మిన హా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఇదే వేదిక ద్వారా ప్రకటించారు. త్వరలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. సాధారణ సభ్యత్వానికి రూ.10 రుసుము, క్రియాశీల సభ్యత్వానికి రూ.50 రుసుము నిర్ణయించామని వెల్లడించారు.

సభ్యత్వ నమోదు కోసం ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రతి నియోజ కవర్గంలో 200 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని వివరించారు. అనంతరం సమావేశంలో పలువురు నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.