28 April, 2026 | 6:06 AM

భారతదేశం అభివృద్ధి కోసమే జనగణన

28-04-2026 01:38 AM

హుజూర్ నగర్ తహసీల్దార్ బండా కవిత

హుజూర్ నగర్, ఏప్రిల్ 27: భారతదేశ అభివృద్ధికి సంపూర్ణ వికాసానికి జనగణన వివరాలు అత్యంత కీలకమని హుజూర్ నగర్ తహసీల్దార్ బండా కవిత అన్నారు. మొదటి విడత బ్యాచ్ జనగణన శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు...

మండల పరిధిలోని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఎలాంటి తప్పులు లేకుండా ప్రజల నుండి సరైన వివరాలు సేకరించి మొదటి విడత జనగణన విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ కెవి సత్యనారాయణ, అమీమ్, ప్రధానోపాధ్యాయులు దాడి నర్సిరెడ్డి, జహూరేఆలం, సూపర్వైజర్లు అత్తి వెంకటేశ్వర్లు, నరేష్, టెక్నికల్ సిబ్బంది యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.