24 July, 2026 | 1:59 AM

వైద్యం సక్రమంగా అందిస్తున్నారా..?

24-07-2026 12:45 AM

మందులు ఇస్తున్నారా లేదా..?

తూప్రాన్, జూలై 23: గతంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండి తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ 50 పడకల దవఖానాలను నిర్మాణం చేయడం జరిగింది. తూప్రాన్ మున్సిపల్ తో పాటు వివిధ మండలాల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ధావకానలో చికిత్స చేయించుకొని స్తోమత లేకపోవడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తూప్రాన్ లో 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ను నిర్మించారు.

సకల సౌకర్యాలతో ఈ ప్రభుత్వ దాకానాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బిఆర్‌ఎస్ అయితే ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నిలదీశారు. గురువారం తూప్రాన్ లోని ప్రభుత్వ దవఖానను బిఆర్‌ఎస్ గజ్వేల్ ఇన్చార్జి ఒంటేరు ప్రతాపరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అందులోని డాక్టర్లను పేషంట్లకు సరైన రీతిగా వైద్యం అందిస్తున్నారా... మందులు సక్రమంగా ఇస్తున్నారా... అని అడిగి తెలుసుకున్నారు.

మాకు అందిన సమాచారం మేరకు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి వస్తే ప్రైవేటు హాస్పిటల్ లోకి తీసుకెళ్లాలని, అంటున్నారని మాతో అనేకమంది చెప్పడం జరుగుతుందన్నారు. వైద్య బృందం సరిగ్గా రాకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అన్ని సౌకర్యాలు ఉండగా ఇక్కడే వైద్యం అందించాలని డాక్టర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బి ఆర్ ఎస్ నాయకులు కాశిరెడ్డి, పట్టణ అధ్యక్షులు సతీష్ చారి, కౌన్సిలర్ జైపాల్ రాథోడ్, చెలిమెల రాములు, ఐలేష్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్, చక్రవర్తి, కుమ్మరి రఘుపతి, పసుల నారాయణ, జయ రాములు, గంగాధర్ వెంకటేష్, బుక్క విజయ్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.