గ్యాస్ నొప్పిని తేలికగా తీసుకోవద్దు: డాక్టర్ సీతారాం నాయక్
ఖమ్మం ఆగస్టు 27, (విజయక్రాంతి): గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల పట్ల జాగ్రత్త అవసరమని ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ సీతారాం నాయక్ సూచించారు. 'వికారం, తల తిరగడం, అజీర్తి, చెస్ట్లో అసౌకర్యంగా ఉంటే అప్రమత్తం అవ్వాలని, ఈ సమస్యను అనేకమంది గ్యాస్ సమస్యగా భావిస్తారని, గ్యాస్ట్రిక్ ఇబ్బందైతే పొట్ట పైభాగం, చెస్ట్ కింద నొప్పి, గుండెలో మంట ఉంటుందన్నారు.
ఛాతీ నొప్పి ఎడమ చేతికి, దవడకు వ్యాపిస్తోందని, దీనితో పాటు చెమటలు, గుండె దడ, ఆయాసం లక్షణాలు కనిపిస్తా యన్నారు. ఒకవేళ రోగికి మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, మద్యపానం, డిస్లిపిడెమియా, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నట్లయితే, అటువంటి సందర్భాలలో ఛాతీలో ఏవిధమైన అసౌకర్యం ఉన్నా మనం గుండె జబ్బుగా కూడా నిర్ధారించుకోవాలని డాక్టర్ సీతారాం నాయక్ వెల్లడించారు. ఈలక్షణాలను ప్రతిసారీ గ్యాస్ నొప్పిగా భావించకూడదని, వయసు, షుగర్, BP ఆధారంగా గుండెనొప్పిగా అనుమానించవచ్చని' డాక్టర్ సీతారాం నాయక్ పేర్కొన్నారు.






