హత్య రాజకీయాలను ప్రోత్సహించొద్దు
13-08-2026 12:46 AM
- కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
- సిరిసిల్లలో వెంకటేశం కుటుంబానికి పరామర్శ
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరా రు. రాజకీయాల్లో తాను ఇరవై ఏళ్లుగా చూస్తున్నా ఇంత చిల్లర రాజకీయాలు ఎప్పు డు చూడలేదన్నారు. సిరిసిల్ల పట్టణంలో హత్యకు గురైన వెంకటేశం కుటుంబాన్ని బుధవారం కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం బిడ్డ పదో తరగతి పూర్తయ్యే వరకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును తమ పార్టీ తరఫున భరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వెంకటేశం హత్య కేసులో చిన్న స్థాయి నాయకులను అరెస్ట్ చేసి, పెద్ద స్థాయి నాయకులను వదిలిపెట్టడం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు.






