ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు
- 95 శాతం ధాన్యం కొన్నాం
- చివరి గింజ వరకూ కొంటాం
- కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ అసత్య ఆరోపణలు
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డు సందర్శన
మంథని, మే 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రైతుల నుంచి 95 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్ప ష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మం థనిలో వ్యవసాయ మార్కెట్ యార్డును సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని, వారి మాటలను రైతులు నమ్మవద్దని కోరారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని 95% ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్ప ష్టం చేశారు. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలను చూపుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ నా యకులు చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు. రైతులను తప్పు దారి పట్టించేందుకు బీజేపీ నా యకులు రాష్ట్రంలో పర్యటిస్తూ ధాన్యం ప్ర భుత్వం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాసంగి సీజన్‌లో భారీ మొత్తం లో పంట చేతికి రావడం వల్ల కొంచెం ఆల స్యం అవుతున్నదన్నారు. రైతులు ఆందోళన చెందవద్ద ని, అధైర్య పడవద్దు అని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ గోదాములు సరిపోకపోతే ప్రైవేటు గోదాములను ఉపయోగించు కోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఆర్డీవో సురేష్, ఏడిఏ అంజనీ మిశ్రా, ఏఓ డాక్టర్ నవ్య, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నా ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, మార్కెట్ క మిటీ చైర్మన్ వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిలి ప్రసాద్, నాగినేని జగన్మోహన్ రావు, కాచే శశిభూషణ్, కిషోర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.






