18 July, 2026 | 1:10 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఇంటర్ ఫలితాలపై తప్పుడు వార్తలు నమ్మొద్దు!

10-04-2026 01:04 AM
  1. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు 
  2. ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో జరుగు తున్న ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పేర్కొంది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ‘ఫ్యాక్ట్‌చెక్ విభాగం’ ఎక్స్‌లో గురువారం ఓ పోస్టు పెట్టింది. ‘ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు. మూల్యాంకన సమయాన్ని బట్టి, ఫలితాల విడుదల ప్రకటిస్తామని, ఈ విషయంలో విద్యాశాఖ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది.