18 July, 2026 | 1:31 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

కొండాపూర్‌లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్

10-04-2026 01:03 AM

శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

శేరిలింగంపల్లి,ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో రూ. 40.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం నూతన భవన నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీతో కలిసి ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్స్ హబ్ను సందర్శించారు.

అక్కడ వైద్య సేవలు, ల్యాబ్ టెస్టులు,ఇతర వసతులపై పేషెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పీఏసీ చైర్మ న్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో రూ.40 కోట్ల 50 లక్షల రూపాయలతో 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణం ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం అని ఇది మన నియోజకవర్గ,

పరిసర ప్రాం తాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పేదలు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలో నాణ్యమైన సేవలు అందించే దిశగా ఇది ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా,డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ లలిత దేవి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి, తహసీల్దార్  మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ హామీద్ పటేల్, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.