18 July, 2026 | 12:50 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

అవినీతి, భూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

10-04-2026 01:05 AM
  1. అవినీతిపై త్వరలో ప్రధానిని కలిసి సీపీఐ విచారణ జరిపిస్తాం
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్,ఏప్రిల్ 9(విజయక్రాంతి): రాష్ట్రంలో భూకబ్జాలు, అవినీతి విచ్చలవిడిగా హద్దు పద్దు లేకుండా పెరిగిపోయిం దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. త్వరలో ప్రధానిని కలిసి సిబిఐ విచారణ జరిపిస్తాం అని పేర్కొన్నారు. భూకబ్జాలను అరి కట్టవలసిన ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు.

ఈ మేరకు గురు వారం విద్యానగర్లోని బీసీ భవన్ లో ఎంపీ ఆర్. కృష్ణయ్య  మాట్లాడుతూ  రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవులలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యేల అక్రమాస్తులపై వారి హయంలో జరిగిన  అధికారం దుర్వినియో గం, అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇంత అవినీతి జరుగుతున్న కొందరు మంత్రులు కొందరు అధికారులు వేల లక్షల కోట్లు అక్రమా ఆస్తులు సంపాదిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రతిపక్షలు ప్రత్యేక్ష పాత్ర పోషిస్తున్నారే తప్ప దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరడం లేదన్నారు.

అందుకే త్వరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణ కోరన్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభు త్వంలో నలుగురు మంత్రులు, కొందరు ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి, సంక్షే మాన్ని గాలికి వదిలేసి, విద్యార్ధులకు ఫీజు లు, స్కాలర్ షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. బిసి హాస్టళ్ళు, గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించడం లేదని అన్నారు.