ధాన్యం కొనుగోలులో జిల్లా ముందంజ
అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ టౌన్, జూన్ 2: అమరుల త్యాగాల ఫలితమే నేటి రాష్ట్ర ఏర్పాటు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు 13వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం జిల్లా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు ఎందరో అమరవీరులత్యాగఫలితంగా 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని స్మరించుకున్నారు. నల్లగొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డ అని మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ సింహభాగం పాత్ర పోషించిందని కొనియాడారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరుగుతున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా‘ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన వివిధ శాఖల ప్రగతిని వెల్లడించారు: జిల్లాలో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10 కోట్ల 83 లక్షల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.508.85 కోట్ల లబ్ధి చేకూరింది.
రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,52,963 మంది లబ్ధిదారులకు రూ.44.12 కోట్ల సబ్సిడీ అందించడం జరిగిందని యాసంగి (2025-26) సీజన్ లో క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర చెల్లించి, 459 కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు ధాన్యం కొనుగోలు చేసి 78,650 మంది రైతుల ఖాతాల్లో రూ.1223.88 కోట్లు జమ చేశారని తెలిపారు రైతు భరోసా కింద వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి వందల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ,జిల్లాలో రైతు రుణమాఫీ కింద 2,33,981 మంది రైతులకు రూ.2004.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు.
జిల్లాలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 2,51,117 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీతో ప్రభుత్వం రూ. 184.40 కోట్ల సబ్సిడీ భరించిందని అన్నారు మొదటి విడతలో జిల్లాకు 18,837 ఇండ్లు మంజూరు కాగా, రూ.275 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారని 2,067 గృహాలు పూర్తి కాగా, రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇండ్లు ఇవ్వనున్నాటు ్లప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు రూ.54 కోట్లు, AMR SLBC ప్రాజెక్టు పనులకు రూ.444 కోట్లు (హై-లెవల్), రూ.52 కోట్లు (లో-లెవల్) మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ రీచ్ పనులకు రూ.1800 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో పనులు జరుగుతుండగా, జిల్లాలో ఫేజ్-1 కింద 532.05 కి.మీ రహదారుల వెడల్పు పనులకు రూ.1457. 66 కోట్లు మంజూరయ్యాయని ప్లాన్ ని ధుల కింద రూ.949.95 కోట్లు, నల్లగొండ పట్టణంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ. 140 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయని అన్నార రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వల్ల జిల్లాలో 11,388 మంది లబ్ధి పొందారని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నతీకరణకు రూ.32.85 కోట్లు మంజూరయ్యాయని, రూ.40 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ లో 4 యూనిట్ల నిర్మాణం పూర్తయి వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని రోజుకు సుమారు 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మిగిలిన ఒక యూనిట్ పనులు జూలై కి పూర్తవుతాయని తెలిపారు.శకటాల ప్రదర్శనలను పరిశీలించారువిధి ప్రతిభ చూపెట్టిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు మెప్మా ద్వారా లబ్ధిదారులకు 6 కోట్ల 46 లక్షల 50 వేల చెక్కును అందజేశారు బాల భవన్ నాగార్జునసాగర్ విద్యార్థుల నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్,అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ కవిత, జిల్లా అధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






