గోపాల్‌పేట్ క్రీడాకారులకు యూనిఫామ్స్ పంపిణీ
నాగిరెడ్డిపేట, జాన్ 9 (విజయక్రాంతి): తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కబాడీ పోటీల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలములోని గోపాల్పేట్ గ్రామ క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో పాల్గొనున్న సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి ఏకరూప క్రీడ దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి మాట్లాడుతూ... క్రీడా రంగాలలో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని స్థాయికి చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తులో క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు,ఓంప్రకాష్ ఉన్నారు.






