10 June, 2026 | 2:05 AM

ప్రత్యక్ష రాజకీయాలకు మల్లారెడ్డి దూరం?

10-06-2026 12:35 AM
  1. ఎన్నికల్లో పోటీ చేయను..
  2. బీఆర్‌ఎస్ టికెట్ ఇస్తే మహేందర్ రెడ్డి పోటీ చేస్తారు..
  3. చిన్న కుమారుడు, కోడలు బీజేపీవో చేరొచ్చు! 
  4. పార్టీ మారాలనే ఆలోచన నాకు లేదు.. 
  5. అనుచరులకు స్పష్టం చేసిన మల్లారెడ్డి 

మేడ్చల్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయా ల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, మేడ్చ ల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (బి ఆర్ ఎస్) ఎన్నికల్లో పో టీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బి ఆర్ ఎస్ అ ధిష్టానం టికెట్ ఇస్తే తన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి బిజెపిలో చేరుతారని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎంపీ తో పాటు 5 ఎమ్మెల్యే టికెట్లు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని బిజెపి అధిష్టానాన్ని అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అనుచరులు కొందరు నేరుగా మల్లారెడ్డిని ఈ విషయమై అడిగారు. తాను పోటీ చేయబోనని, టిఆర్‌ఎస్ టికెట్ ఇస్తే మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు.

అంతేగాక చిన్న కుమారుడు భ ద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి బిజెపిలో చేరుతారని సూటిగా చెప్పకుండా చేరుతారేమోనని అన్నారు. బిజెపిలో చేరబోనని, బి ఆర్‌ఎస్‌లోనే ఉంటానని చెప్పారు. మల్లారెడ్డి కోడలు ప్రీతి రె డ్డికి రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఆమె బిజెపిలో చేరుతారని పార్లమెంటుకు పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 

బిఆర్‌ఎస్ సమావేశాలకు మల్లారెడ్డి దూరం

నియోజకవర్గంలో మూడు చోట్ల ఇటీవల బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు, సర్ పై అవగాహన సమావేశాలు నిర్వహించారు. మేడ్చల్, ఘట్కేసర్ తో పాటు మరోచోట సమావేశాలు జరిగాయి. వీటికి సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి స్థానికంగా ఉన్నప్ప టికీ సమావేశాలకు హాజరు కాలేదు. పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా హాజరయ్యారు. స్థానికంగా ఉండి సమావేశాలకు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. బిజెపిలోకి వెళ్తున్నందున సమావేశాలకు హాజరు కాలేదని ప్రచారం జరిగింది. 

మల్లారెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ అధిష్టానం అసంతృప్తి 

మల్లారెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ లో ఉంటూనే కాంగ్రెస్ బిజెపి నేతలను కలిశారు. వార్షికోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోడీని వేసి ఆహ్వానించారు.

పార్టీకి సమాచారం లేకుండా కలవడంపై అధిష్టా నం గుర్రుగా ఉంది. బి ఆర్ ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం లో ఈ విషయమై కెసిఆర్ మల్లారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీకి సమాచారం ఇవ్వకుండా సీఎంను కలవడంతో బిఆర్‌ఎస్కు చెందిన ముఖ్య నాయకులు వివాహ వార్షికోత్సవానికి గైరహాజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన డి ప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ విషయమే అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. 

వ్యూహాత్మకమా..?

మల్లారెడ్డి నిర్ణయం వ్యూహత్మకమా లేక నిజంగానే పోటీ చేయరా అనేది చర్చనీ అంశమైంది. వాస్తవానికి మల్లారెడ్డి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకో టర్మ్ పోటీ చేయగలరు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అనుచరులకు అర్థం కా వడం లేదు. ఆరు నెలల క్రితం తాను పోటీ చేయను అని అ న్నారు. ఆ తర్వాత మళ్లీ నేను అలా అనలేదు అంటూ మాట మార్చారు. ఇప్పుడు కూడా మాట మార్చేస్తారా? నిజంగానే పోటీకి దూరంగా ఉంటారో వేచి చూడాల్సిందే!