చిరు వ్యాపారులకు నీడ.. గొడుగుల పంపిణీ
- 50 60 సంవత్సరాలు పైబడిన మహిళలకే.
- ఇప్పటివరకు చేసిన వితరణ కోటి రూపాయలు పైబడి
- లబ్ధిదారులు 1,80,000 మంది
- మీకోసం మేమున్నాం సహాయక కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ వెల్లడి.
చర్ల ,(విజయక్రాంతి): కాసేపు ఎండలో బైటకి వెళ్లాలంటేనే అల్లాడిపోతాం, అలాంటిది రోజంతా ఎండలో మాడిపోయే నిరాశ్రయులు, నిరుపేద చిరు వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తుంది. మండే ఎండలకు వడదెబ్బకి పండుటాకుల్లా రాలిపోతుంటారు అభాగ్యులు. వేసవి ఎండల్లో అవస్థలు పడుతూ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న, 50 60 సంవత్సరాలు పైబడిన మహిళలు. అలాంటి నిరుపేదలకు గొడగులు ఇచ్చి వారికో నీడ చూపించారు మీకోసం మేమున్నాం సహాయక కమిటీ సంస్థ ప్రతినిధులు. మండల కేంద్రం లో ప్రతీవారం జరిగే ఆదివారం సంతలో చిరు వ్యాపారులు,వీథి వ్యాపారస్తులు ఎండ తాపానికి విలవిలాడిపోవఢం నిలువ నీడకు కూడా నోచుకోకపోవడం కడు సోచనీయం. ఈ విషయం సంతలో మీకోసం మేమున్నాం టీం సభ్యుల దృష్టికి వచ్చిన వెంటనే,
దీనికి పరిష్కారంగా 50 - 60 సంవత్సరములు నిండిన మహిళా వ్యాపారులకు 7 అడుగుల వెడల్పు ఉన్న నీడ,గొడుగులను ఉచిత పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి, ఒక్కో గొడుగుకు - 700/- రూ చొప్పున వితరణలు సేకరించి రెండవ విడతగా తెప్పించిన 12 గొడుగులను ఆదివారం రోజున లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా మీకోసం మేమున్నాం టీం ఛైర్మెన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా చర్ల మండల ప్రజలకు విస్తృత సేవలు అందించడంలో సంస్థ ముందు వరుసలో పయనిస్తుందనీ, సుమారు 1 కోటి రూపాయల వితరణలను సేకరించి - సుమారు 1,80,000 మంది లబ్ధిదారులకు సేవలందేలా కార్యక్రమాలు చేసామనీ, ప్రస్తుతం సంతలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు లబ్ది చేకూరేలా ఈ నీడ గొడుగులను పంపిణీ చేస్తూన్నామని తెలిపారు. అలాగే మిగిలిన వ్యాపారులకు కూడా రాబోవు సంతలో ఈ గొడుగులను ఉచిత పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి సేవా కార్యాక్రమానికి వెన్నంటి నడిపిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు, చింతా రామ్మోహన్ మాష్టారు, బీవీ ప్రసాద్, అభిషిక్తుని ప్రేం కుమార్, చింతలపాటి అశోక్, కొమ్మినేని నాగేశ్వరరావు, దొడ్డి తాతారావు, కుప్పాల సౌజన్య , రేగల్ల సుధాకర్, బేతా సతీష్, కుంట సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు.




