12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

19-03-2026 02:55 PM

మఠంపల్లి మార్చి 19(విజయ క్రాంతి): ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో గల కౌసర్,మదీన మస్జిద్ ల ఆవరణలో స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం పేద ముస్లిం కుటుంబాలకు గురువారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని,అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు.

ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు సయ్యద్ వహాబ్,షేక్ మదార్ సాబ్,మస్జిద్ కమిటి చైర్మన్ షేక్ అమీర్,మదిన మస్జిద్ కమిటి చైర్మన్ మగ్బుల్, మైనారిటీ నాయకులు అబ్దుల్ అహ్మద్, ఉస్మాన్,బషీర్,మౌజన్ అజీస్,సైద ఖాసీం,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.