25 April, 2026 | 2:15 AM

న్యూట్రిషన్ కిట్ల అందజేత

25-04-2026 12:24 AM

మాసాయిపేట్ /చేగుంట ఏప్రిల్ 24 : మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి, అచ్చంపేట్, హకీంపేట్, బొమ్మారం, పోతన్ పల్లి, నాగ్సన్ పల్లి, చెట్ల తిమ్మాయిపల్లి, నడిమి తండా గ్రామాల గర్భిణీ స్త్రీలకు100 మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్లను నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్, రాజన్న ఫౌండేషన్ చైర్మన్ ఆవుల రాజిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని, గర్భధారణ సమయంలో, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి,  శిశువు ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డీ, స్థానిక సర్పం కృష్ణ రెడ్డి, వివిధ గ్రామాల సర్పం లు, ఉపసర్పం లు, మాజీ ప్రజ ప్రతినిధులు, సినియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.