9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

రాంనగర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

29-09-2025 10:25 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ రాంనగర్ సెంటర్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఏమేమి పువ్వుపోనే గౌరమ్మ, ఏమేమి కయోప్పునే గౌరమ్మ, అనే పాటలతో తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మను చేసి రాంనగర్ కూడలిలో గౌరమ్మను కొలిచారు. అనంతరం మార్తనేని జయంతి ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో అన్ని దేవదేవతలకు పూలతో పూజిస్తామని, ఒక బతకమ్మకు మాత్రమే పూలనే దైవంగా భావిస్తూ పూజిస్తామని అన్నారు. ప్రతి ఏడా భక్తిశ్రద్ధలతో 9 రోజులు బతుకమ్మని పూజిస్తూ 9వ రోజు నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు  భారతి,నాగమణి, శ్రియా రెడ్డి,  అనిత, ఉమా, కంది సరళ తదితరులు పాల్గొన్నారు.