24 August, 2026 | 3:56 AM

మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ

24-08-2026 12:45 AM

ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలోని మానసిక వికలాంగుల విద్యార్థి కేంద్రంలో ఆదివారం విద్యార్థులకు భోజనం వితరణ చేసారు. ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద వారి కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా.. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్,

ఘట్కేసర్ మున్సిపల్ మా జీ చైర్మన్ పావని, జిల్లా కార్యదర్శి ముత్యాలుయాదవ్, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎదులాబాద్  డివిజన్ అధ్యక్షులు సామల ఆమరేందర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మీసాల మల్లేష్, మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, ఘనపురం నేతాజీ యువజన సంఘం సభ్యులు, శాలువాలతో, సన్మానించి, కేక్ కట్  చేయించి తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.