30 May, 2026 | 6:19 PM

ఇందిరమ్మ చీరల పంపిణీ

30-05-2026 05:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. పట్టణంలోని గాజులపేట్ వైయస్సార్ కాలనీ ప్రియదర్శిని నగర్ రాంనగర్ కాలనీలో మహిళలకు ఉచితంగా చీరలను అందించారు. మహిళల ఆత్మగౌరవం పెంచేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా అధికారులు పాల్గొన్నారు.