సుల్తానాబాద్ మున్సిపల్ లో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
30-05-2026 05:17 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆవరణలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, గర్రెపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లేపల్లి జానీ, కాంగ్రెస్ నాయకులు కుమార్ కిషోర్, పెగడ పరశురాములు పలువురు ఉన్నారు.






