30 May, 2026 | 6:19 PM

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

30-05-2026 05:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ మాస్ లైనపార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజన్న గంగన్న గఫూర్ లక్ష్మి బక్కన్న తదితరులు ఉన్నారు.