13 March, 2026 | 7:18 PM

మొల్లమాంబ జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

13-03-2026 05:51 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని అశ్వాపురం మండలంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ... మొల్లమాంబ ఆశయాలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆమె ఆలోచనలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు భాదిష శంకర్ రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆమెదా రేణుక, అశ్వాపురం మండల అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, పాల్వంచ మండల అధ్యక్షుడు గుడిమెట్ల సత్యనారాయణ, బొడ్డుపల్లి పల్లవి, సూర్యనారాయణ, గంగాధర కృష్ణ, మాడుగుల వెంకటేశ్వరరావు, బొడ్డుపల్లి రాము, కానుగుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.