ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ
ఘట్ కేసర్, మార్చి 20 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని నారాయణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈద్ కా తోఫా రంజాన్ కానుకలను ముఖ్య అతిథి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం లకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేస్తుంది.
ఈసందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పండుగల సారాంశం పరస్పర సహకారం, సామరస్యం, సోదరభావమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా ద్వారా పేద, అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీక అని, ఈ పవిత్ర సందర్భంగా ప్రతి కుటుంబం ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలో బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్,ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, నాయకులు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




