21 March, 2026 | 4:10 PM

చేవెళ్లలో డయాలసిస్ సెంటర్ బంద్

21-03-2026 01:06 AM
  1. కొనసాగుతున్న భవన నిర్మాణం పనులు

వాటర్, డ్రైనేజ్ కరెంట్‌కు ఆటంకం

చేవెళ్ల, మార్చి 20 : చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనిలో డయాలసిస్ సెంటర్ ల్లో సేవలు నిలిచి పోయా యి. రోగులకు సమాచారం ఇవ్వకుండా సెంటర్ మూసి వేశారని శుక్రవారం రోగు లు ఆసుపత్రికి వచ్చి గగ్గోలు పెట్టారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డయాలసిస్ సెంటర్ బంద్ చేస్తే పరిస్థితి ఏంటని డాక్టర్లను నిలదీశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి సమా రు 30 నుండి 40మంది డ యాలసిస్ రోగులు వైద్యం పొందుతున్నారు.

ఆసుపత్రికి వచ్చిన డయాలసిస్ రోగుల కరెంట్ సరఫరా నిలిచిపోయిందని సమాధా నం చెబుతున్నారని రోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి  వద్దకు వచ్చిన రోగులను వికారాబాద్, షాద్ నగర్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారులు స్పదించి డయాలసిస్ రోగులకు సేవలు పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు. 

ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం ః ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాజేంద్రప్రసాద్

నూతన ఆసుపత్రి భవన నిర్మాణంలో భాగంగా డయాలసిస్ సెంటర్కు వెళ్లే విద్యుత్ కలెక్షన్ నిలిచిపోయి వాటర్, డ్రైనేజ్‌లు కనెక్షన్లు డామేజ్ అయ్యాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రత్యామ్నయంగా రోగులను వికారాబాద్, షాద్‌నగర్ ఆసుపత్రులకు వైద్యం కోసం పంపామన్నారు. సెంటర్ నిర్వాహణకు పాలియేటివ్ కేర్ సెంటర్లో నిర్వహించేందుకు డీఎంహెచ్వోఅనుమతి కోరామన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభిస్తామన్నారు.