4 April, 2026 | 9:31 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

04-04-2026 07:32 PM

మునిపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాయికోడు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. అలాగే సిఎంఆర్ఎఫ్ పథకానికి ధరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.