రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్
నంగునూరు,(విజయక్రాంతి): రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగు ఇబ్బందులు లేకుండా సరైన ధర, సకాలంలో కొనుగోళ్లు, మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
పంటల కొనుగోలు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గోదాములు, తూకం యంత్రాలను అందుబాటులో ఉంచుతున్నామని, రాబోయే సీజన్ కోసం కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, యువతకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని పవన్ కుమార్ పేర్కొన్నారు.




