4 April, 2026 | 11:56 PM

దుర్వినియోగపరచిన నిధులపై విచారణ చేపట్టిన అధికారులు

04-04-2026 09:05 PM

జిల్లా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు చర్యలు డిఎల్పీఓ యాదయ్య

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకట రత్నపూర్ గ్రామ పంచాయతీలో గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగపరచారని మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నుండి డి ఎల్ పి ఓ. యాదయ్య సదరు అధికారులు వెంకటరత్నాపూర్ గ్రామ పంచాయతీని శనివారం సందర్శించి దుర్వినియోగపరచిన నిధుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లను అడిగి తెలుసుకుని పరిశీలించారు.

అధికారి పూర్తిగా పరిశీలించి అవకతవకలు ఏర్పడ్డాయని హెచ్చరించారు. బోరుకు సంబంధించిన మోటర్లు మోటార్లకు సంబంధించిన కేబుల్స్ షానిటేషన్ వెచ్చించిన ఖర్చు కొంత మేరకు ఉంటే వాటి బిల్లులను ఎక్కువ చేసి బిల్లులు చూపించడంతో డీఎల్పీఓ అధికారి వాటిని పరిశీలించి సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్లను హెచ్చరించారు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగ పరిచిన దీనిపై జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని వారన్నారు. ఇందులో ఏఈ అధికారి, గ్రామ సెక్రెటరీ, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.