క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో శనివారం ఉదయం 7 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ శాంతి జెండాను ఊపి ప్రారంభించారు. ఏసుక్రీస్తు ప్రభువు పునరుద్దానుడైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాలు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో క్రైస్తవ సంఘాలు ఏకతాటిపై రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ నుండి శాంతి ర్యాలీనీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎస్పి నరేందర్ గౌడ్ ను క్రైస్తవ సంఘల పాస్టర్లు శాలువా తో సన్మానించారు. అనంతరం తూప్రాన్ ప్రధాన రహదారి గుండా 30 మంది పాస్టర్ల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీగా వెళుతూ ఏసుక్రీస్తు పునరుద్దానుడైన విధానాన్ని తెలియజేస్తూ పోతరాజుపల్లి కమాన్ సీఎస్ఐ చర్చ్ వద్ద విశ్రమించారు. ఈ సభ అనంతరం తూప్రాన్ ఎస్సై గంగరాజు ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ క్రైస్తవ సంఘాల ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ తిమోతి, సి ఎస్ ఐ చర్చ్ ప్రెస్ బీటర్ ఇంచార్జ్ వసంత కుమార్, సెక్రెటరీ జీవరత్నం, ట్రెజరర్ శాలెం రాజు, ప్రసంగికులు రేవ్. సాల్మోన్ రాజ్, ఫాదర్ వినీత్, క్యాథలిక్ ఫాదర్ ధనరాజ్, పాస్టర్స్. కే మోజెస్, జి ప్రసాద్, ఎస్ మోజేష్, స్వామి దాస్, సామేల్ రాజ్, రాజకుమార్, లాజర్, దేవరాజ్, దేవదానం, బాబు, కిరణ్, పాల్గొని విజయవంతం చేశారు.




