4 April, 2026 | 11:57 PM

సజ్జన్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

04-04-2026 09:14 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధనలో యువత చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్మలి మణయ్య మాట్లాడారు.

శనివారం అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు ఆధ్వర్యంలో, సజ్జన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏప్రిల్ 14న సజ్జన్‌పల్లి చౌరస్తాలో నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మహనీయుల ఆలోచనలను నేటి తరానికి పరిచయం చేసి సమాజ మార్పు కోసం యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.