5 April, 2026 | 12:13 AM

భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది భగవద్గీత

04-04-2026 09:17 PM

కొల్చారం,(విజయక్రాంతి): భావితరాలకు హిందూ సంస్కృతి సంప్రదాయాలను  తెలియజేసేది భగవద్గీత అని ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ అన్నారు. శనివారం పాఠశాలలోని విద్యార్థులకు మన జ్యోతి ఆశ్రమం ద్వారా ఉచితంగా వచన రూపంలో ఉన్న భగవద్గీత ప్రతులను అందజేశారు.

భగవద్గీత చదవడం ద్వారా విద్యార్థులలో ఏది మంచి ఏది చెడు అన్న వివేకజ్ఞానం కలగడంతో పాటు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు గురించి తెలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ చారి, రవీందర్ రెడ్డి, దుర్గాప్రసాద్ అర్జున్ శివరాములు రాగిణి, మణి జ్యోతి ఆశ్రమ ప్రతినిధులు శ్రీశైలం బాలకృష్ణ ప్రసాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.