సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బిక్కనూరు,(విజయ క్రాంతి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆరు కుటుంబాలకు చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు.లబ్ధిదారులు,మట్టే విహారిక రూ.18,500, బాలమేళ రచన రూ.34,000 ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే వచ్చి సాయం అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు అంబటి సాయగౌడ్, గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి, శేఖర్ రెడ్డి, గొల్ల మహేందర్, పోలు మహేందర్, కొముర గౌడ్, భారత్ రెడ్డి, సిద్దయ్య తో పాటు నాయకులు పాల్గొన్నారు.




