20 June, 2026 | 9:47 PM

మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ

20-06-2026 08:30 PM

సిరిసిల్ల/గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలంలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం సందర్శించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వృద్ధులు, అనాథల సంక్షేమం పట్ల సమాజం బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.