ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 10: సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన మల్లేపల్లి మోహన్ రెడ్డికి 60,000, మల్లేపల్లి బాలమణికి 55,000, సుర్వి పద్మశంకరయ్యలకు 23,500, దామ ముత్యాలుకి 60,000, ముద్దంగుల ముత్తమ్మకి 11,000, సూర్వీ వెంకటయ్యకి 18,000 రూపాయల చెక్కులను అందించారు.
మాజీ సర్పంచ్ దొనూరి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఆరోగ్య అవసరాల నిమిత్తం ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ ఉప సర్పంచ్ ఉప్తుల అండాలు యాదయ్య, వార్డు సభ్యులు దామ మల్లేష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కేశాని దిలీప్, కేశాని రాజు, సూర్వి ముత్యాలు, మర్రి ఇస్తారి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






