1 April, 2026 | 5:01 AM

రవీంద్ర భారతి హై స్కూల్లో సర్టిఫికెట్ల పంపిణీc

01-04-2026 12:00 AM

సనత్‌నగర్, మార్చి 31 (విజయక్రాంతి): నగరంలోని రవీంద్ర భారతి హై స్కూల్లో మంగళవారం ప్రత్యేక సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డా. ఎన్. రవీందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు చదువులో, క్రీడల్లో, ఇతర ప్రతిభా రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా డా. ఎన్. రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో కూడా క్రమశిక్షణతో చదువుతూ మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్ర మంలో డీన్ శ్రీలత, డి.ఐ హాది మొహమ్మద్, ప్రిన్సిపల్ సారిత, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.