25 April, 2026 | 7:01 PM

వారా సంతలో అంబలి పంపిణీ

25-04-2026 05:29 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ  శనివారం చేశారు. ఈ కార్యక్రమానికి  ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లాబిన్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉబెద్ బిన్ యహియా (తారిఖ్) ఆధ్వర్యంలో  తీవ్ర ఎండల సమయంలో బాటసారులు,  ప్రజలకు ఉచితంగా అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రతి వేసవిలో అంబలి పంపిణీ చేయడాన్ని ప్రశంసించారు.