25 April, 2026 | 7:09 PM

వేసవి శిక్షణ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

25-04-2026 05:32 PM

జిల్లా కలెక్టర్ హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడాకారులు వేసవి శిక్షణ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి క్రీడల శిక్షణ శిభిరాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవితో కలిసి కలెక్టర్ హరిత ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థుల కొరకు వేసవి క్రీడల శిక్షణ లో భాగంగా హ్యాండ్ బాల్, కబడ్డీ, అథ్లెటిక్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోని క్రీడలలో రానించాలన్నారు. ఈ సందర్భంగా క్రీడ కారులకు క్రీడా దుస్తులు షులు అందజేశారు.