ప్రయోజనాలను వివరించి చైతన్య పరచాలి
పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
మానకొండూరు,(విజయక్రాంతి): 14 ఏళ్లలోపు పిల్లల్లో 68 శాతం మంది నులిపురుగుల ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని, దీనివల్ల శారీరక పెరుగుదల లోపం, రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడతాయని పచ్చనూరు గ్రామ సర్పంచ్ పార్నంది కిషన్ (కేశవ్) విద్యార్థులకు వివరించారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోవైద్య సిబ్బందితో కలిసి ఆల్బెండజోల్ మాత్రలు అందించి మాట్లాడారు.
పాదరక్షలు లేకుండా ఆడటం వల్ల, బహిరంగ మలవిసర్జన, మురికి చేతుల వల్ల ఇది వ్యాపిస్తాయని విద్యార్థులకు వైద్య సిబ్బందితో కలిసి ఆల్బెండజోల్ మాత్రలు అందించి మాట్లాడారు. పాదరక్షలు లేకుండా ఆడటం వల్ల, బహిరంగ మలవిసర్జన, మురికి చేతుల వల్ల ఇది వ్యాపిస్తాయని విద్యార్థులకు తెలియజేశారు. ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు నులిపురుగుల వల్ల కలుగుతాయని చెప్పారు. ఈ మాత్రల వల్ల దుష్ప్రభావాలు ఉండవని వీటి ప్రయోజనాలను వివరించే ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకునేలా చైతన్య పరచాలని ఆయన కోరారు.






