జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ
తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు MRO, MPDO, CI, SI, EOPRD, CDPO తదితర అధికారులు హాజరయ్యారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తాగునీరు సరఫరా మెరుగుదల, అంతర్గత రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటుపై సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు గ్రామంలోని ప్రతి అర్హుడికి అందేలా చూస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధి అందరి బాధ్యత అని, ప్రజలు సహకరించాలని సర్పంచ్ కొడప ప్రకాష్ కోరారు.






